ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 12:24 PM

వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీరేట్లను ​వరుసగా పదోసారి యథాతథంగా ఉంచింది. మూడు రోజుల సమీక్ష అనంతరం ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు​. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్​ రెపో రేటు కూడా 3.35 శాతం వద్ద యథాతథంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు. 2020 మే 22న శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఎంపీసీ చివరి సారిగా వడ్డీరేట్లలో మార్పులు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 2021-22 ఏడాదికి 5.3 శాతం, 2022-23 ఏడాదికి 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa