భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) అభివర్ణించారు. ఈ ఒప్పందం ఖరారైతే ఇరు ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ, సేవా రంగాలకు భారీ ఊతం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇండియన్ ఎనర్జీ వీక్ సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని, ఈ ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. "భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదరబోతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చర్చిస్తున్నాయి. ఈ డీల్ 140 కోట్ల మంది భారతీయులకు, యూరప్‌లోని లక్షలాది ప్రజలకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది" అని మోదీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa