రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వంతు చర్యలను మమ్మురం చేసింది. ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో దుబాయ్ లో ప్రారంభమైన ఎక్స్ పో-2020లో ఏపీ పెవిలియన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఏపీ పెవిలియన్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేడు ప్రారంభించారు. దుబాయ్ లోని ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఏపీ పెవిలియన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యూఏఈ విదేశాంగ మంత్రి కూడా హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులు, ప్రాజెక్టులకు సంబంధించిన పుస్తకాన్ని యూఏఈ మంత్రి ఆవిష్కరించారు. ఇదిలావుంటే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏపీ పెవిలియన్ ను తీర్చిదిద్దారు. ఏపీలో పెట్టుబడులు, సానుకూలాంశాలపై ఈ పెవిలియన్ ద్వారా అవగాహన కలిగించనున్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్ల వీడియోలను, విద్య, వైద్య, టూరిజం, ఐటీ, పోర్టులపై వీడియోలను పెవిలియన్ లో ప్రదర్శిస్తారు. ఏపీలో మౌలిక సదుపాయాలు, ఎగుమతి అవకాశాలపై వివరణ కోసం 12 స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa