సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కానున్నారనే సంకేతాలు అందుతున్నాయి. ఆయన త్వరలో సంచలన నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న అందుకు ముహూర్తం కూడా పెట్టేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వంలో లేదా పార్టీలో కీలక పదవి అప్పజెప్పొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తొలుత మంత్రి వర్గ ప్రక్షాళన చేపట్టనున్నట్లు పలువురు భావిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ, ప్రతిపక్షాలపై విరుచుకుపడే కొందరికి మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీ ప్రక్షాళన కూడా చేస్తారని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యువతకు పెద్ద పీట వేస్తారని, కష్టపడే వారికి కీలక పదవులిస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మూడు రాజధానుల అంశం కూడా అప్పుడే కొలిక్కి రానుందని అంతా పేర్కొంటున్నారు. మరింత కసరత్తు చేసి, మరోసారి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రుల నుంచే ప్రకటనలు వచ్చాయి. ముఖ్యంగా వైజాగ్‌ను రాజధానిగా చేస్తూ ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారనే చర్చ సర్వత్రా సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa