మహిళల ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ, "రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే, ఈ రోజు మా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. టీ20 క్రికెట్లో ఇలాంటివి సహజమే. కొన్నిసార్లు మన వ్యూహాలు బెడిసికొడతాయి" అని పేర్కొంది. ముంబై బ్యాటర్ నాట్ సివర్ బ్రంట్ (100 నాటౌట్) మెరుపు శతకంతో ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa