కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ హుగ్లీ జిల్లా శ్రీరామ్‌పోర్‌లోని పారామౌంట్ నర్సింగ్ హోమ్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్‌ను బెదిరించారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రోడ్డుప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువచ్చారు ఐదుగురు వ్యక్తులు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం.. రోగికి ఏం జరిగిన ఆస్పత్రి బాధ్యత వహించదు అనే కాగితాలపై సంతకం చేయమని ఆస్పత్రి సిబ్బంది వారిని అడిగింది. సంతకాలు చేయమని వారు సిబ్బందికి తేల్చిచెప్పారు. ఈ క్రమంలో చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో క్షతగాత్రుడికి త్వరగా వైద్యం చేయమంటూ.. ఆ దుండగులు డాక్టర్‌పై పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. ఇంతలోనే క్షతగాత్రుడితో సహా అందరూ అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa