హిందూపురం: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో మంగళవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు.అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తనను దాటుకుని ముందుకెళ్తున్న ఓ అభిమానిపై ఆగ్రహంతో ఊగిపోయి అతని చెంప చెళ్లుమనిపించారు. గతంలో కూడా పలుమార్లు బాలకృష్ఱ అభిమానులపై చేయిచేసుకున్న విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa