ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సైన్యం పాల్పడుతున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. రష్యాకు చెందిన ఒక ట్యాంక్ రోడ్డుపై వెళ్తున్న కారుపైకి వేగంగా దూసుకెళ్లింది. వెనక్కి వెళ్లి మరి దానిని బలంగా తొక్కేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పార్లమెంట్ భవనానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగినట్లు స్కై న్యూస్ తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యా సైనికులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa