ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా బుధవారం ఉక్రెయిన్ దేశంలోని ప్రాముఖ్యమైన నగరం ఖార్కివ్‌పై బాంబుల మోత మోగిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో జనావాసాలపైనా రష్యా బాంబులు వేసింది. తాజాగా ఓ ఆసుపత్రిపై వైమానిక దాడులకు పాల్పడింది. అయితే తాము పోరాడుతున్నామని, ఖార్కివ్ నుంచి రష్యా సేనలను తరిమిగొడతామని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. క్షిపణి దాడులలో నామరూపాల్లేకుండా పోయిన ఫ్రీడమ్ స్కేర్‌పై ఆ దేశ మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భవనం సోవియెట్ యూనియన్ హయాం నుంచి పరిపాలన కేంద్రంగా ఉంది. అక్కడి ప్రసూతి వార్డును బాంబుల నుంచి రక్షణ కల్పించే ప్రాంతంగా వెనువెంటనే మార్చారు. కాగా ఈ దాడిపై రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్యగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ మరిచిపోలేరని, క్షమించలేరని అన్నారు. తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa