విశాఖ రైల్వేజోన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్‌సభలో టిడిపి ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు అశ్వనీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. డీపీఆర్ అమలు తుది దశలో ఉందన్నారు. పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని.. వీలైనంత త్వరగా సౌత్ కోస్ట్ జోన్‌ను ప్రారంభించనున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.