కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ బి. శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సున్న గ్రామీణ మహిళలు అర్హులన్నారు. 30 రోజుల శిక్షణ సమయంలో వసతితో పాటు భోజన సదుపాయం ఉచితంగా కల్పించనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన మహిళలు నాలుగు ఫొటోలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు తీసుకుని కల్లూరు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఉన్న తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 63044 91236ను సంప్రదించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa