విషాహారం తిని పశువులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కౌతాళంలో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామంలోని పశువుల కాపరి పశువుల మందను తీసుకొని రోజు మాదిరిగా వెళ్లారు. పశువులు జొన్న పంట వేసిన పొలంలో మేత వేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో 16 పశువులు మృతి చెందాయి. ఇందులో 14 ఆవులు, రెండు గేదెలు చనిపోయాయని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కౌతాళం పశువైద్యాధికారి దినకరన్, ఆదోని వైద్యాధికారి వంశీ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకొని చికిత్సలు ప్రారంభించారు. జొన్న కోత అనంతరం మిగిలిన పంట భాగం విషపూరితమై ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa