అబ్బాయికి 17 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకున్నారు. అయితే వీరికి పోలీసులు సహకరించారంటూ అమ్మాయి తరపు వారు పోలీసుస్టేషన్ ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. వారి వివరాల మేరకు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు.
అయితే యువతి తల్లిదండ్రులు వేరే అబ్బాయితో నిశ్చితార్థానికి సిద్ధపడ్డారు. ఇది తెలుసుకున్న ప్రేమికుడు ఈ నెల 20వ తేదీన 100 కాల్ కు ఫోన్ చేసి. తాను ప్రేమించే అమ్మాయికి నిశ్చితార్థం చేస్తున్నారని, దాన్ని నిలిపివేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు.
వెంటనే ఆలూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం రావడంతో ఇరు కుటుంబాలను ఆలూరు సీఐ ఈశ్వరయ్య స్టేషన్‌కు పిలిపించారు. ప్రేమికుడు తాము ఇద్దరం ప్రేమించుకుంటున్నామని స్పష్టం చేశాడు. అబ్బాయికి ఆధార్ కార్డు ఆధారంగా 21 ఏళ్లు ఉన్నప్పటికీ 10వ తరగతి టీసీ ఆధారంగా 17 ఏళ్లు ఉన్నాయని, ఇది మంచి పద్ధతి కాదని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు మాత్రం ఆధార్ కార్డు చూసి 21 ఏళ్లు ఉన్నాయని చెప్పి ఎవరికి ఇళ్లకు వారు వెళ్లాలని అన్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం బాలుడితో వివాహానికి ఒప్పుకునేది లేదని, అమ్మాయిని తమవెంట తీసుకెళ్తామని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రేమికులిద్దరూ అక్కడున్న వారి కళ్లుగప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్న ఫొటోను మంగళవారం తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామ పెద్దలకు వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామ పెద్దలు ఆలూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
పోలీసులు నమ్మించి మోసం చేశారని, అమ్మాయిని తమతో పంపించకుండా అబ్బాయితో పంపించడం వల్లే పెళ్లి చేసుకున్నారని ఆరోపించారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్యను వివరణ కోరగా నేను ఆధార్ కార్డు చూశాను. అందులో అబ్బాయికి 21 ఏళ్లు ఉన్నాయని, అమ్మాయి ఇష్టం ప్రకారం అక్కడికైనా వెళ్లవచ్చని చెప్పాను అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa