పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లిలో మంగళవారం సాయంత్రం హృదయ విదారక ఘటన నెలకొంది. ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కాగా. అమ్మకానికి తెచ్చిన పెట్రోలు డబ్బాలు ఆ దుకాణంలో ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దుకాణంలో ఉన్న తల్లిని రక్షించడానికి బయట ఉన్న కూతురు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ మంటల్లో తల్లి సజీవదహనం అయింది. కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa