మనిషి బయటకు రాకుండా చేయడం, అది కూడా మనిషి రాకుండానే ప్రజలకు అవగాహన కల్పించాలంటే అది మాత్రం ఓ సవాలే. కానీ చైనా వినూత్నంగా ఆలోచించింది. ఇదిలావుంటే చైనాలో కొన్నివారాలుగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దాంతో దేశంలోని అనేక నగరాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. షాంఘై మహానగరంలోనూ కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో కొన్నిరోజుల కిందట లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో, షాంఘై వీధుల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అధికారులు రోబోల సాయంతో ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెబుతూ, ఇళ్లలోనే ఉండాలని, బయటికి రావొద్దంటూ ఒక రోబో హెచ్చరికలు చేసుకుంటూ ముందుకు సాగింది. చైనా భాషలో ఉన్న ఆ ఆరోగ్య ప్రకటనలు రోబో వీపుపై ఉన్న స్పీకర్ లోంచి వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa