జనసేన క్రియాశీలక కార్యకర్తలకు జనసేన అండగా ఉత్తము అని భరోసా కల్పించింది. మంచి నిలవాలి , మానవత్వం గెలవాలి అనే భావనతో సమాజంలో జరుగుతున్నా తప్పులను ప్రశ్నించడమే మా హక్కు అనే సంకల్పంతో ముందుకు నడుస్తున్న పార్టీ జనసేన. తాజాగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 - 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సి జి ప్రసాద్ , డి జి ఎం గారికి చెక్ ను ఈరోజు ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు శ్రీ వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి. రత్నం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa