ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక చార్జీల వసూళ్లతో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 12:24 PM

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన వైసిపి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఖండిస్తూ నిన్న విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిధిలో ఏర్పాటుచేసిన నిరసన ధర్నా లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... పేద మధ్యతరగతి ప్రజల జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ అధిక చార్జీల వసూళ్లతో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ తక్షణమే నిర్ణయం మార్చుకోవాలి లేకుంటే క్షేత్ర స్థాయి నుండి ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ అసమర్థతను ప్రజల్లోకి తీసుకుని పోవడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa