ఐపీఎల్ 2022 లో భాగంగా నిన్న జరిగిన 8వ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య రసవత్తరమైన పోరు సాగింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ హోరాహోరీ పోరులో కోల్కతా ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ 10వికెట్లను తీసుకుని, కేవలం 137 పరుగులకే పంజాబ్ ను కట్టడి చేసింది. పంజాబ్ టీమ్‌లో రాజపక్స మాత్రమే 9 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసి 31 పరుగులు చేశాడు. రబడ 16 బంతుల్లో 25 , లవింగ్ స్టోన్(19), ధావన్ (16) పరుగులు చేశారు . తమ దూకుడు బౌలింగ్‌తో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు కోల్కతా బౌలర్లు. ఉమేష్ 4, సౌతీ 2, శివమ్ మావి, నరైన్, రస్సెల్ తలా ఒక వికెట్ పడగొట్టి కోల్కతా విజయంలో కీలక పాత్ర వహించారు.
138 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ స్టార్టింగ్ నుంచే దుమ్మురేపారు. కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా 15 బంతుల్లో 5 ఫోర్లు బాది 26 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. 23 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి సామ్ బిల్లింగ్స్ కూడా నాటౌట్‌గా నిలిచాడు. అజింక్య రహానె 12 పరుగులు చేయగా, 14.3 ఓవర్లకే నిర్దేశిత లక్ష్యాన్ని చేరి టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించారు కోల్కతా ఆటగాళ్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa