వివిధ విశ్వాసాలు, నమ్మకాల కొలువు మన భారతదేశం. దోష నివారణ కోసం అంటూ మేకను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. జాతకం పట్ల ఆ యువకుడికి ఉన్న నమ్మకమే ఇందుకు కారణం. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు రెండు పెళ్లిళ్లు జరుగుతాయని జాతకంలో ఉండడంతో దోష నివారణ జరిపించాలని ఆ యువకుడు అనుకున్నాడు. ఉగాది సందర్భంగా నిన్న స్థానికంగా ఉండే నవ గ్రహ ఆలయంలో అర్చకులు ఆ యువకుడికి మేకతో మొదటి వివాహం జరిపించారు. మన హిందూ ధర్మంలో దోష నివారణ కోసం ఇలా చేయొచ్చని ఉందని వారు చెప్పారు. పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa