ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో టెన్త్‌ విద్యార్థులకు అదనపు క్లాసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 07:38 AM

ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు ఒంటిపూట బడులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. వీరికి ఉదయం 7.30 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించి మధ్యాహ్న భోజనం పెడతారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఒంటిపూట బడుల్లేవు. వారికి ఈ నెల 27 నుంచి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa