ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం గవర్నర్ కార్యాలయం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. సోమవారం ఏపీలోమ 13 కొత్త జిల్లాలను జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గవర్నర్ కార్యాలయం జగన్‌కు అభినందనలు తెలిపింది. ఏపీలో ఈ నెల 4 నుంచి 26 జిల్లాలతో పాలన ప్రారంభమైందని, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన జగన్‌కు అభినందనలు అంటూ గవర్నర్ సదరు ట్వీట్‌లో పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఇంతకుముందే గవర్నర్‌కు పంపిన ఏపీ ప్రభుత్వం గవర్నర్ ఆమోదంతోనే కొత్త జిల్లాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa