ఆపిల్‌ని రోజుకి ఒకటి తీసుకుంటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చు అనే సంగతి అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల తర్వాత పురుషులు గానీ స్త్రీలు గానీ ప్రతి రోజు డైట్‌లో సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అయితే అన్ని పండ్ల కంటే కూడా యాపిల్ చాలా మంచిది. ఆపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలానే ఆపిల్స్‌లో ఫ్లవనోయిడ్స్ డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. బాడీ ఇంఫ్లమేషన్‌ని సరిగ్గా ఉంచుతుంది. అలానే మెటబాలిక్ రేట్‌ని పెంపొందిస్తుంది. రోజూ ఒక ఆపిల్ తీసుకుంటే బరువు కూడా తగ్గవచ్చు. కాబట్టి తప్పని సరిగా డైట్‌లో ఆపిల్ తీసుకుంటూ ఉండండి.