గతానికి భిన్నంగా గ్రామీ అవార్డుల వేడుకల్లో ఏ.ఆర్.రెహమాన్ హాజరయ్యారు. భారత సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గ్రామీ అవార్డుల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందుకు కారణం ఆయన తన కుమారుడు ఏఆర్ అమీన్‌తో కలిసి ఈ వేడుకలకు హాజరు కావడమే. లాస్ వెగాస్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు ఎప్పటి మాదిరే పలు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందులో భాగంగానే ఈ దఫా కూడా రెహమాన్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అయితే ఎన్నడూ లేని రీతిలో ఈ దఫా వర్ధమాన గాయకుడిగా ఇప్పుడిప్పుడే సినీ రంగంలో నిలదొక్కుకుంటున్న తన కుమారుడు అమీన్‌ను తీసుకుని ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. కుమారుడిని గ్రామీ అవార్డుల వేడుకకు తీసుకెళ్లిన రెహమాన్ వేదికపైకి తన కుమారుడిని తీసుకుని వెళ్లి మరీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెహమాన్.. ఆ ఫొటోకు "గ్రామీస్" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఇక తొలిసారిగా ఈ వేడుకలకు హాజరైన అమీన్ కూడా తన తండ్రితో కలిసి దిగిన ఫొటోకు "పేరెంటింగ్" అన్న ట్యాగ్‌ను జత చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.