ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదిలో కొట్టుకుపోయిన నవ జంట

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 10:21 AM

కేరళకు చెందిన ఓ నవ జంట పోస్ట్​ వెడ్డింగ్​ షూట్​ చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మరణించగా..వధువు పరిస్థితి విషమంగా ఉంది. కేరళలో సాహసోపేతమైన 'పోస్ట్​ వెడ్డింగ్'​ షూట్​లు, 'సేవ్​ ది డేట్'​ షూట్​లు క్రేజ్​గా మారిపోయాయి. ఇలాంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కోజికోడ్​ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్​ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా..వధువు పరిస్థితి విషమంగా ఉంది.ఇదీ జరిగింది: కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత షూట్​కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో రెజిల్​ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com