సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సోమవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో 12 పరుగుల తేడాతో, ఈ సీజన్లో వరసగా రెండో విజయాన్నందుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్ లో లక్నో సారథి రాహుల్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, మొత్తం 68 పరుగులను చేసి జట్టు విజయాన్నందుకోవడంలో కీలక పాత్రను పోషించాడు.
ఈ మ్యాచ్ లో రాహుల్ చేసిన అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఐపీఎల్ లో కొత్త రికార్డు నమోదు అయింది. గత ఆరేళ్లలో 30 ఐపీఎల్ అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో డేవిడ్ వార్నర్ రెండవస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ 28 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో, AB డివిలియర్స్ 26 అర్ధ సెంచరీలతో నాలుగో స్థానంలో, శిఖర్ ధావన్ 25 హాఫ్ సెంచరీలతో 5వ స్థానంలో ఉన్నారు.