బాపట్ల జిల్లా అవుతుందా ఇది జరిగేపని కాదు అని, కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేదని, జిల్లా కావడానికి ఎన్నో వసతులు, మౌళిక సదుపాయాలు, భవనాలు, విశాలమైన రోడ్లు కావాలి.
బాపట్లలో ఇది జరగటం అసాధ్యం. ఏమీ కాకుండానే ఊరులో అన్న రోడ్లు వెడల్పు చేసే నెపంతో భవనాలు తొలగిస్తున్నారు. ఆలు లేదు చూలు లేదు. అంతా అనవసర హడావుడి. ఇవన్నీ కొందరు పనిగట్టుకొని గత రెండు సంవత్సరాలలో ఉబుసుపోని కాలక్షేపం కబుర్లు బాపట్లలో షికారు చేసాయి.
అన్నింటికి ఒకటే చిరు దరహాసం. తొణకలేదు. ఆవేశపడలేదు. మాట జారలేదు, ఎవరినీ ఒక్క మాట అనలేదు. జరిగేది చూడండి అన్నట్లు ఆయన పని చేసుకొని వెళ్ళి పోతూనే ఉన్నారు. బాపట్ల రూపురేఖలు మార్చి పడేశారు. ఇప్పుడూ అదే దరహాసం. గర్వం లేదు. ల్అహంకారం లేదు. వినమ్రతతో నేడు బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవం లో జిల్లా ప్రారంభంలో అధికారబాధ్యతలు తీసికొన ప్రతి ప్రభుత్వ శాఖ అధికారులను సాదరంగా ఆహ్వానించి సముచిత రీతిలో గౌరవించారు
. అదే ఆయన గొప్పతనం. మరో గొప్ప ఈ జిల్లాకేంద్రం ఏర్పాటు లో తన వెంట అహర్నిశలు శ్రమించిన బాపట్ల అధికారులను పేరుపేరున వేదికపైకి పిలిచి వారు పడ్డ శ్రమను సభాముఖంగా అభినందించటం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. ఆయనే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అని ప్రజలు అంటున్నారు.