పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే విరమించుకోవాలని టిడిపి జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనలను విరమించుకోవాలని కోరారు. విరుస్తున్నారు లేనిపక్షంలో ప్రజలే రాబోయే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.