కృష్ణా జిల్లా: జీ కొండూరు మండల పరిధిలోని జీ కొండూరు గ్రామ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడాలని ఆ గ్రామ సర్పంచ్ మండలి అరుణ అధికారులను ఆదేశించారు. జీ కొండూరు గ్రామ పరిధిలోని 9వ వార్డులో తాగు నీటి పైపు లైన్ లీక్ అయ్యి తాగునీటి సరఫరా కు అంతరాయం ఏర్పడింది. దీంతో తక్షణమే స్పందించిన ఆమె అధికారులతో మాట్లాడి దగ్గరుండి పైపు లైన్ మరమ్మతులు చేయించారు.