బీజేపీ, శివసేన పార్టీల మధ్య వార్ తీవ్ర రూపందాల్చుతోంది. తాజాగా మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేనకు చెందిన ఎంపీ, ఆ పార్టీ పత్రిక సామ్నా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. గతంలో వెలుగు చూసిన పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రౌత్ పాత్రపై ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణల ఆధారంగా రౌత్‌కు చెందిన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రూ.1,034 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ఈడీ.. తాజాగా రౌత్‌కు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో రౌత్‌కు చెందిన ముంబైలోని అలీబాగ్, దాదర్‌లలోని ఒక్కో ప్లాట్ ఉన్నాయి. ఈడీ అటాచ్‌పై స్పందించిన రౌత్.. ఈ తరహా బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. ఆస్తులను సీజ్ చేసినా, కాల్చివేసినా, జైలుకు పంపినా కూడా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa