దేశంలోని యూట్యూబ్ ఛానళ్లపై గతంలోనూ కొన్నింటిపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఛానళ్లపై కూడా విధించింది. సామాజిక మాధ్యమాల్లో దేశ సమగ్రతను దెబ్బతీసే అంశాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో 22 యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించింది. దేశభద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధానికి గురైన వాటిలో 18 దేశీయ యూట్యూబ్ చానళ్లు కాగా, 4 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లున్నాయి. దేశభద్రత, ప్రజాక్షేమం దృష్ట్యా వీటిని నిషేధించినట్టు కేంద్రం వెల్లడించింది. ఆయా యూట్యూబ్ చానళ్లు టీవీ చానళ్ల లోగోలు వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వివరించింది. యూట్యూబ్ చానళ్లనే కాకుండా 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్ బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిషేధించినట్టు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa