ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ పరామర్శ యాత్ర తేదీలు ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 08:32 AM

ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఏప్రిల్ 12 నుంచే ఆయన పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అనంతపురం జిల్లా నుంచి యాత్రను పవన్ ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లల్లో 1,857 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని వివరించారు. సీఎం జగన్ మరోసారి పాదయాత్ర చేపడితే రైతులే ముందు అడ్డుకుంటారని అన్నారు. రైతు భరోసా పేరుతో మభ్యపెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. వైసీపీ పాలనతో రైతులు ఆర్థికంగా చితికి పోయారన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa