ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగాల్ లో కంగారూలు...అధికార్లలో కంగారు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 03:52 PM

పశ్చిమ బెంగాల్‌లోని జలపాయ్‌గురి జిల్లా.. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ జిల్లాలో రోడ్లపై కంగారూలు తిరుగుతూ కనిపించాయి. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రిపోర్టుల ప్రకారం... అటవీ అధికారులు, పోలీసులూ కలిసి... మూడు కంగారూలను జలపాయ్ గురి జిల్లాలో శుక్రవారం కాపాడారు. వీటిని స్మగ్లర్లు ఇండియాకి తీసుకొచ్చినట్లు తెలిసింది. స్మగ్లర్ల నుంచి తప్పించుకున్న కంగారూలు... రోడ్లపైకి వచ్చినట్లు తెలిసింది. కంగారూల గడ్డ ఆస్ట్రేలియా. అక్కడి న్యూగినియాలో అవి ఎక్కువగా ఉంటాయి. అలాంటివి అవి ఇండియాలో కనిపించడం చిత్రంగా మారింది. 


ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారూ. ఆ దేశ కరెన్సీ, ఆయుధాలపై కంగారూల ముద్రలుంటాయి. ఆస్ట్రేలియాలో పనిచేసే చాలా సంస్థలు కంగారూల ట్రేడ్ మార్క్‌ను వాడుతుంటాయి. చిత్రమేంటంటే... ఈ జంతువులు ఆస్ట్రేలియాలోని టాస్మేనియా, న్యూగినియాలో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ లేవు. అందువల్ల కంగారూ అంటే ఆస్ట్రేలియా జంతువుగానే గుర్తిస్తాం. కానీ అవి ఇండియాలో కనిపిస్తే ఒకింత ఆనందం, ఆశ్చర్యం కలగడం సహజమేగా.నెటిజన్లతోపాటూ... అటవీ అధికారులు కూడా ఈ వీడియోలను చూసి మొదట ఆశ్చర్యపోయారు. వేల కిలోమీటర్ల సముద్రాన్ని దాటి అవి జలపాయ్‌గురికి ఎలా వచ్చాయో అనే డౌట్ అందిరికీ వచ్చింది. మూడు కంగారూలను కాపాడిన అటవీ అధికారులు సిలిగురి దగ్గర్లో చనిపోయిన ఓ కంగారూ పిల్లని చూశారు. కాపాడిన కంగారూలకు కూడా గాయాలున్నాయి. వాటిని బెంగాల్ సఫారీ పార్కుకి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అసలు కంగారూలు ఎలా వచ్చాయో తేల్చేందుకు అధికారులు ఓ టీమ్‌ని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు. "అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. వాటిని అడవిలోకి ఎవరు తెచ్చారో తెలియాలి. అసలు ఎందుకు తెచ్చారో తెలియాలి" అని బెలకోబా ఫారెస్ట్ రేంజ్ ఆర్వో ఎస్ దత్తా తెలిపారు.


బెంగాల్‌లో కంగారూలు కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ నెల మొదట్లో అలీపూర్‌ద్వార్ జిల్లాలో ఓ కంగారూని అటవీ అధికారులు కాపాడారు. వీటిని ఆస్ట్రేలియా నుంచి స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చారని అనుకోవచ్చు. కానీ ఎందుకో తెలియాలి. ఇండియాలో ఈ రాకెట్ ఎవరు నడుపుతున్నారో తేలాలి. ఆస్ట్రేలియాలో విశాల గడ్డి మైదానాలు ఉంటాయి. అక్కడ కంగారూలు జీవించేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో వాటిని అభివృద్ధి చేస్తే... ఇండియాలో కూడా అవి జీవించేందుకు అవకాశాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa