ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ సేన హ్యాట్రిక్ ఓటమి

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 11:39 AM

ఐపీఎల్ 2022 లో భాగంగా బుధవారం జరిగిన 14వ లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడగా, ఐదు సార్లు ట్రోఫీ విన్నర్ అయిన ముంబై జట్టును నైట్ రైడర్స్ 5 వికెట్ల తేడాతో మట్టికరిపించారు. దీంతో వరుసగా మూడు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించిన  కోల్కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది ముంబై. 


తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్నీత 20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 161 పరుగులను చేసింది. ముంబై విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి ఐదు వికెట్ల తేడాతో కోల్కతా జట్టు విజయం సాధించింది.  కాగా ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన కమిన్స్ ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్‌సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ముంబై బౌలర్ సామ్స్‌ వేసిన 16వ ఓవర్‌ లో ఏకంగా 4 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టి మొత్తం మీద 35 పరుగులు చేయగా, ఆ ఓవర్లోనే కోల్‌కతా విజయం ఖరారైపోయింది. మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు విజయాన్ని అందించిన కమిన్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa