లలితా జ్యూయలరీ మార్ట్ అధినేత ఎం.కిరణ్ కిరణ్ కుమార్ గారు నరసరావుపేట పట్టణంలో నూతన బ్రాంచ్ తెరవబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులూ మిట్టపల్లి రమేష్ ను కలిసి ఆహ్వానం అందించారు. అలానే స్థానిక టీడీపీ కార్యాలయానికి విచ్చేసి, పట్టణంలో ఈ నెల 10న నూతనంగా లలితా జ్యూయలరీ మార్ట్ షాపు ప్రారంభోత్సవ సందర్భంగా టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానించేందుకు వచ్చిన కిరణ్ కుమార్ ను దుశ్శాలువలతో అరవింద్ బాబు ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు,లలితా జ్యూయలరీ మార్ట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa