ఓ యువకుడు ప్రేమ పేరుతో బాధితురాలికి దగ్గరయ్యాడు. అతడి మాయ మాటలకు ఆ అమ్మాయి పడిపోయింది. ఇదే అదునుగా బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి, స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్నాటకలోని యలహంక ప్రాంత శివారులో ఉండే బాలిక(15)ను స్థానిక యువకుడు(25) ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. తరచూ వెంటపడేవాడు. ఆ బాలిక తన ప్రేమను అంగీకరించగానే ఓ ఇంటికి ఆమెను ఆహ్వానించాడు. బాలిక రాగానే ఆమెపై అత్యాచారం చేశాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ అఘాయిత్యాన్నిఅతడి మిత్రుడు వీడియో తీశాడు. దానిని తన స్నేహితులకు కూడా పంపించాడు. వారు ఆ వీడియో చూపించి, వారం రోజులుగా ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి ఆ బాలిక డబ్బులు కూడా ఇచ్చింది. గురువారం బాలిక తీరును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంపై ఆమె విషయమంతా చెప్పింది. శుక్రవారం బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ముమ్మరం చేసి, శనివారం నాటికి నిందితులందరినీ అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa