ఏడేళ్ల బాలికపై ఓ హిజ్రా అత్యాచారం చేసిన ఘటన యూపీలో బరేలీలోని మిరాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను హిజ్రా బెదిరింపులకు గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం హిజ్రా పరారీలో ఉన్నట్లు సమాచారం.
బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఫరీన్ అనే హిజ్రా నివసిస్తోంది. పక్కింట్లో టీవీ చూస్తున్న సమయంలో బాలిక దగ్గరికి వెళ్లి ఆమెను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికపై హిజ్రా అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. మార్చి 29న ఈ ఘటన జరిగిందని, బాధిత బాలిక హిజ్రాకు భయపడి విషయం చెప్పలేదని తెలిపారు. అయితే, కడుపు నొప్పి అధికం కావడం వల్ల బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిజ్రాను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.