ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయ్యిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు గవర్నర్ కు కొత్త మంత్రుల జాబితా పంపిస్తామని తెలిపారు.
కొత్త మంత్రివర్గంలో 10 మంది పాత వారు, 15 మందిని కొత్తవారిని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవారం వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉదయం 11.31 గంటలకు నిర్వహించనున్నారు.మరోవైపు 24 మంది మంత్రుల రాజీనామాకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. మరికాసేపట్లో ఖాళీలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.