మధ్యప్రదేశ్లో ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్ పైనే దాడికి దిగాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద కర్రతో తరిమి తరిమి కొట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతరం పోలీస్ పై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దినేష్ ప్రజాపతి అనే వ్యక్తి తన బైక్ తో కానిస్టేబుల్ జై ప్రకాశ్ బైక్ ని ఢీ కొట్టాడు. దాంతో ప్రకాశ్ `జాగ్రత్తగా బైక్ నడుపు` అని దినేష్ ను హెచ్చరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న దినేష్ తీవ్రంగా ఆగ్రహం చెంది ఆ కానిస్టేబుల్ లాఠీని లాక్కుని మరీ కొట్టాడు. అయినా కానిస్టేబుల్ తిరగబడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే దినేష్ మాత్రం కానిస్టేబుల్ని వదలకుండా వెంబడించి మరీ దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.