మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై ఆయన అభిమానులు ఆందోళన చేశారు. రెంటచింతల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తగలబెట్టారు. మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు.