రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు మూడు బృందాలుగా రాష్ట్రంలో పర్యటించి జిల్లా స్థాయి, బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ బృందాలకు నాయకత్వం వహిస్తారు.
రాష్ట్ర భాజపా నేతలు మూడు బృందాలుగా రాష్ట్రంలో పర్యటిస్తారని.. జిల్లా స్థాయి, బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సదస్సులు నిర్వహిస్తారని, తొమ్మిది చోట్ల పార్టీ సమావేశాలు నిర్వహిస్తారని, కర్ణాటకలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప బృందాలకు నాయకత్వం వహిస్తారని బొమ్మై విలేకరుల సమావేశంలో తెలిపారు.