ఏపీ కేబినెట్ విస్తరణలో 8 కొత్త జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. వీటిలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. అయితే కొన్ని కొత్త జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కాయి.
ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కిన జిల్లాలు ఇవే..
శ్రీకాకుళం జిల్లా- ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు
కోనసీమ- చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్
ప.గో. జిల్లా- కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ
పల్నాడు జిల్లా - అంబటి రాంబాబు, విడదల రజని
చిత్తూరు జిల్లా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రోజా