కొత్త కేబినెట్ కూర్పుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నాం అని అన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అని సజ్జల అన్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించామని అన్నారు. పాత కేబినెట్ లో మళ్లీ 11 మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈసారి కేబినెట్ లోని 25 మందిలో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. ఈసారి కేబినెట్ లో నలుగురు మహిళలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎన్నికల కోసం చేయలేదన్నారు.