వేసవి సీజన్ ప్రారంభం కావడంతో పెళ్లి కళ వచ్చేసింది. ఈ ఎండాకాలం సీజన్ లో భారీగా ముహుర్తాలు ఉన్నాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అధిక సంఖ్యలో వేడుకలు జరగనున్నాయి. పంచాంగాన్ని బట్టి ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 13 నుంచి జూన్ 23వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అధిక సంఖ్యలో ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ లో 13, 14, 15, 16, 17, 21, 22, 24, మే నెలలో 3, 4, 12, 13, 14, 15, 18, 20, 21, 22, 25, జూన్ నెలలో 1, 3, 5, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీల్లో శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా ఒకే రోజు నాలుగైదు వేడుకలు ఉండడం విశేషం. రానున్న 3 నెలల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్లు పురోహితులు చెబుతున్నారు.