పదవ డివిజన్ ఆదివారం శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పదో డివిజన్ కార్పొరేటర్ షేక్ మీరావలిని వార్డు పెద్దలు, డివిజన్ ప్రజలు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మీరావలి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మహోన్నత పాలకుడు శ్రీరాముడు అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని సీతారాములను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో శంకర్, బాలయ్య, సూరి బాబు రాంబాబు వైసిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.