రాష్ట్రంలో జగన్ సర్కార్ చేసినటువంటి నూతన మంత్రివర్గంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభానుకి చోటు దక్కిందని అనుకున్న సమయంలో ఈ ఆదివారం ఇప్పటి వరకు నూతనంగా వెలువడిన మంత్రులు పేర్ల లో సామినేని కి చోటు దక్కనందుకు జగ్గయ్యపేట వైసిపి కార్యకర్తలు, అభిమానులు భగ్గుమన్నారు. బోశెట్టి త్రినాథ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిoచారు. రోడ్లపై టైర్లు, ట్యూబులు పై మంటలు పెట్టి కాల్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు, ఉదయభాను నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.