నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో హోంగార్డు రాజశేఖర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు సెంట్రల్ వెర్ హౌస్ లో గత రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం లేదని చెప్పిన హోంగార్డు పై దాడికి పాల్పడి పరారయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.