కడపలోని డీఎస్ఏ క్రీడామైదానం లో హాకీ సబ్ జూనియర్ జిల్లా బాలుర జట్టుకు క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ సంఘం బాషా ఒక ప్రకటనలో కార్యదర్శి ఎస్. సుబాన్ తెలిపారు. క్యాంపునకు హాజరయ్యే క్రీడాకారులు 4 కలర్ ఫొటోలు, ఆధార్ కార్డు, ఒరిజినల్ మరియు కలర్ జిరాక్స్, బర్త్ సర్టిఫికెట్ ఒరిజినల్, కలర్ జిరాక్స్, మాస్క్, శానిటైజర్ తీసుకురావాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అనంతపురంలో జరిగే అంతర్ జిల్లాల హాకీ చాంపియన్ షిప్ లో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. క్రీడాకారులు సోమవారం ఉదయం కోచ్ కల్యాణ్ కు రిపోర్ట్ చేయాలని సూచించారు.