జిల్లాలోని పరిశ్రమలకు ప్రతి సోమవారం పవర్ హాలిడే ప్రకటించినట్లు విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎన్. శోభా వాలెంటీనా ఒక ప్రకటనలో తెలిపారు. నిరంతరాయంగా నడిచే ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్ ను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. మిగతా పరిశ్రమలకు సోమవారం పవర్ హాలిడే వర్తిస్తుందన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ కూడా విద్యుత్ పొదుపును పాటించాలన్నారు. గృహావసరాలకు 24 గంటలు విద్యుత్ ను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బొగ్గు కొరత, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ నెలాఖరుకు పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆసుపత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రిమ్స్ కు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే ప్రత్యేక ఫీడర్ ఉందని తెలిపారు. ఒకవేళ పవర్ కట్ అయినా ఏడు సెకన్లలోనే జనరేటర్ ఆన్ అవుతుందన్నారు.