విజయనగరం జిల్లా మక్కువ మండలం నుండి మార్కొండపుట్టి వెళ్తువుండగా ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి మక్కువ ఎస్సై సీతారామ్ చేరుకొని, ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలుసుకొని, మృతి చెందిన వ్యక్తి సాలూరు మండలం గాదిపల్లి వలస గ్రామానికి చెందిన గాదిపల్లి తిరుపతిగా గుర్తించారు. మక్కువ నుంచి మార్కొండపుట్టి వెళ్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి పంట పొలంలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అక్కడికక్కే ఆ వ్యక్తి మృతి చెందాడు.