పాకిస్థాన్ ప్రధాని చేపట్టగలరని భావిస్తున్న షెహబాజ్ షరీఫ్ ఓ ముక్కుసూటి వ్యక్తి. మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేస్తారు. అన్న నవాజ్ షరీఫ్ తో పాటే రాజకీయాల్లోకి ప్రవేశించినా ఆయన కంటే ఆలస్యంగానే ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు. నవాజ్ లాగానే ఈయనపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. జమ్మూకశ్మీర్ తోనూ ఆయనకు సంబంధం ఉంది.